• Webdunia Deals
Candidate Name బండి సంజయ్ కుమార్
State तेलंगाना
Party BJP
Constituency करीमनगर
Candidate Current Position Member of the Lok Sabha

బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. బండి బి.నరసయ్య బి.శకుంతల దంపతులకు 1971 జూలై 11న జన్మించారు. 1986లో కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో తన మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేశాడు. బండి పన్నెండేళ్ల వయసులో సంస్థలో చేరి యువకుడిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో కూడా చురుకుగా పనిచేశారు. తర్వాత తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి 2014లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. 
 
బీజేపీలో...
ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో బండి చేరి, చివరికి సంస్థకు పట్టణ అధ్యక్షుడిగా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మారారు. బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చాలో కూడా పాల్గొన్నారు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చేపట్టిన సూరజ్ రథయాత్రలో 35 రోజుల పాటు భారతదేశం అంతటా ప్రచారం చేసారు. 
 
2005లో కరీంనగర్ 48వ డివిజన్‌కు మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2019లో లోక్‌సభకు ఎన్నికై రాజీనామా చేసే వరకు ఈ పాత్రలో పనిచేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 2014, 2018లో బిజెపి అభ్యర్థిగా రెండుసార్లు కరీంనగర్‌ స్థానానికి పోటీ చేశారు. అయితే ఆయన రెండు ఎన్నికల్లోనూ విఫలమై తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి తరపున పోటీ చేసి గెలుపొందిన ఆయన ఇపుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 

Election Schedule
States No of Seats Date of Poll
Delhi 70 FEB, 05, 2025